ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసిన సూపర్ స్టార్ !

Published on Jul 24, 2019 10:06 pm IST

‘మలయాళ స్టార్ హీరో’ పృధ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ హీరోగా వచ్చిన సూపర్ హిట్ పొలిటికల్ థ్రిల్లర్ ‘లూసిఫర్’. ఈ మలయాళ చిత్రం ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద 150 కోట్లు కలెక్ట్ చేసి.. మలయాళ సినీ పరిశ్రమలో కొత్త రికార్డ్స్ సృష్టించింది. కాగా ప్రస్తుతం ఈ చిత్రానికి సీక్వెల్ చేస్తోన్న విషయం తెలిసిందే.

కాగా ఇటీవలే ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని.. మొదటి షెడ్యూల్ షూట్ కి వెళ్లిన ఈ సీక్వెల్ ఫస్ట్ షెడ్యూల్ కి సంబంధించిన షూటింగ్ పార్ట్ ను పూర్తి చేసుకుంది. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ కి చెందిన మరికొంత మంది తారలు కూడా కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ‘లూసిఫర్’ మొదటి పార్ట్ లో స్టీఫెన్ గట్టుపల్లి అనే పాత్రలో నటించిన మోహన్ లాల్ మరి సీక్వెల్ లో ఎలాంటి పాత్రలో కనిపిస్తారో చూడాలి.

సంబంధిత సమాచారం :