ప్రధాన మంత్రి పాత్రలో మలయాళ సూపర్ స్టార్ ?

Published on Jan 9, 2019 1:20 am IST

‘రంగం’ ఫేమ్ కెవి ఆనంద్ దర్శకత్వంలో తమిళ స్టార్ హీరో సూర్య నటిస్తున్న 37వ చిత్రం ‘కాప్పాన్’. ఇటీవల ఈచిత్రం రెండు షెడ్యూల్స్ ను కంప్లీట్ చేసుకుంది. ఇక ఈచిత్రంలో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ప్రధాన మంత్రి పాత్రలో నటిస్తున్నారని సమాచారం. ఆయనకు సెక్యూరిటీ కమాండర్ గా సూర్య కనిపించనున్నాడట. బోమన్ ఇరానీ , ఆర్య , చిరాగ్ జానీ ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తుంది. హారిస్ జైరాజ్ సంగీతం అందిస్తున్నఈ చిత్రంలో సూర్య సరసన ‘అఖిల్’ ఫేమ్ సయేశా సైగల్ కథానాయికగా నటిస్తుంది.

ఇక సూర్య ప్రస్తుతానికి ఈ చిత్ర ఘాటింగ్ కి బ్రేక్ ఇచ్చి సెల్వ రాఘవన్ తెరకెక్కిస్తున్న’ఎన్ జి కె’ చివరి షెడ్యూల్ షూటింగ్ లో పాల్గొంటున్నాడు. పొలిటికల్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈచిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ 14న విడుదలకానుంది.

సంబంధిత సమాచారం :