‘మోనాల్ – అఖిల్’ వెబ్ సిరీస్ కాన్సెప్ట్ అదే !

Published on Apr 25, 2021 7:00 pm IST

‘బిగ్‌ బాస్’ షోతో పాపులారిటీ తెచ్చుకున్న ‘మోనాల్’ – అఖిల్’ కలిసి ఒక వెబ్ సిరీస్ చేయబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అఖిల్ హీరోగా ఒక సినిమా కూడా చేస్తున్నాడు. అటు మోనాల్ కూడా ఐటెమ్ సాంగుల నుంచి, టీవీ షోల వరకూ ఏది వదిలిపెట్టకుండా వచ్చిన క్రేజ్ ను క్యాష్ చేసుకునే పనిలో ఉంది. మొత్తానికి వీరిద్దరి కలయికలో వస్తోన్న వెబ్ సిరీస్ పై మంచి అంచనాలు ఉండే అవకాశం ఉంది. ఇక వెబ్ సిరీస్ కథ విషయానికి వస్తే తెలుగు అబ్బాయి – గుజరాతీ అమ్మాయి మధ్య లవ్ అనే కొత్త కాన్సెప్ట్ తో ఈ వెబ్ సిరీస్ రూపొందనుంది.

ఈ సిరీస్ లో అఖిల్ క్యారెక్టర్ చాల కొత్తగా ఉంటుందని… అటు మోనాల్ గెటప్ కూడా కొత్తగా ఉండబోతుందని తెలుస్తోంది. ఇక బిగ్ బాస్ వల్ల వచ్చిన క్రేజ్ తో సెకండ్ ఇన్నింగ్స్ ను సక్సెస్ ఫుల్ గా నడిపిస్తోంది మోనాల్. మొదటి నుండి మోనాల్ ఆఫర్ల విషయంలో చాల తెలివిగా ముందుకు పోతుంది. ఆల్రెడీ తనకు హీరోయిన్ ఇమేజ్ ఉన్నా.. చిన్న పాత్ర అయినా చేస్తానంటూ ముందుకుపోతుంది. మరోపక్క బిగ్ బాస్ విజేతగా నిలిచిన తర్వాత అభిజిత్ ఇప్పటివరకు హీరోగా సినిమా ప్రకటించకలేదు.

సంబంధిత సమాచారం :