గెట్ రెడీ..”పుష్ప” నుంచి మరిన్ని క్రేజీ అప్డేట్స్.!

Published on Nov 14, 2021 2:00 pm IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న భారీ సినిమా “పుష్ప” నుంచి ఒక్కొక్కటిగా అదిరే అప్డేట్స్ ఇప్పుడు వస్తున్నాయి. సాంగ్స్ మరియు సినిమాలని పాత్రలను నెవర్ బిఫోర్ లుక్స్ లో ప్రెజెంట్ చేస్తూ చిత్ర యూనిట్ పుష్ప పై ఓ రేంజ్ హైప్ ని తీసుకొస్తున్నారు. ఇక ఈ రోజు సినిమా నుంచి నాలుగో పాట మాస్ సింగిల్ ని అనౌన్స్ చేశారు.

దీనితో పాటుగా చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ వారు రానున్న రోజుల్లో మరిన్ని క్రేజీ అప్డేట్స్ లైన్ లో ఉన్నట్టుగా కన్ఫర్మ్ చేసారు. సినిమా నుంచి సాలిడ్ ట్రైలర్ కట్ అలాగే దాని తర్వాత సినిమా నుంచి ఐదవ పాట ఇంకా సినిమా ఈవెంట్స్ వాటిని మించి మరిన్ని స్పెషల్ అనౌన్స్మెంట్స్ అన్నీ రెడీగా ఉన్నట్టు కన్ఫర్మ్ చేసేసారు.

దీనితో రిలీజ్ కి ముందు పుష్ప కి నెక్స్ట్ లెవెల్ ప్రమోషన్స్ సిద్ధంగా ఉన్నాయని అర్ధం అవుతుంది. ఇంకా జస్ట్ నెల రోజులు మేర సమయమే మిగిలి ఉంది సో పుష్ప నుంచి ఈ బ్లాస్టింగ్ అప్డేట్స్ ఒక్కక్కటిగా వస్తూనే ఉంటాయి గెట్ రెడీ.. మరి ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా ఐకానిక్ దర్శకుడు సుకుమార్ రెండు భాగాలుగా ఈ సినిమాని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :

More