“సర్కారు వారి పాట” సెకండ్ సింగిల్ పై మరింత ఆసక్తి.!

Published on Mar 17, 2022 8:00 am IST

మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న లేటెస్ట్ మరియు అవైటెడ్ భారీ సినిమా “సర్కారు వారి పాట” కోసం అందరికీ తెలిసిందే. దర్శకుడు పరశురామ్ పెట్ల తీస్తున్న సినిమా నుంచి ఇప్పటికే వచ్చిన క్లాస్ సాంగ్ మాస్ రెస్పాన్స్ అందుకొని ఇప్పుడు 100 మిలియన్ వైపు దూసుకెళ్తుంది.

మరి ఈ సినిమా నుంచి ఇపుడు మరో సాంగ్ ని అనౌన్స్ చెయ్యడంతో ఒక్కసారిగా మంచి హైప్ నెలకొంది. అయితే ఈసారి మాస్ సింగిల్ ని రిలీజ్ చేస్తున్నట్టు కన్ఫర్మ్ కాగా అది ఏ సాంగ్ అనేది మరింత ఆసక్తిగా మారింది. దీనితో అనౌన్స్ చేసే ఆ సాంగ్ లైన్ మరియు డేట్ కోసం మహేష్ ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

పైగా థమన్ మరియు మహేష్ ల కాంబోలో వారి తాలూకా ఇంట్రో సాంగ్స్ కి స్పెషల్ క్రేజ్ కూడా ఉంది. దూకుడు నుంచి ఆగడు వరకు వారి ఇంట్రో సాంగ్స్ సెన్సేషన్ ని క్రియేట్ చేసాయి అందుకే సర్కారు వారి పాట ఇంట్రో సాంగ్ కోసం మహేష్ ఫ్యాన్స్ సహా మ్యూజిక్ లవర్స్ కూడా మరింత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

సంబంధిత సమాచారం :