మహేష్ నెక్స్ట్ పై మరిన్ని గాసిప్స్.!

Published on Nov 26, 2020 9:00 am IST

వరుసగా మొత్తం మూడు బిగ్ బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాల అనంతరం తన హ్యాట్రిక్ జైత్ర యాత్రను కొనసాగించాలని సూపర్ స్టార్ మహేష్ బాబు మొదలు పెట్టిన తాజా చిత్రం “సర్కారు వారి పాట”. వరుస హిట్స్ తో మంచి ఫామ్ లో ఉన్న పరశురామ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు.

అయితే ఈ చిత్రం షూట్ మొదలవుతున్న సన్నాహాలు జరుగుతున్న నేపథ్యంలో మహేష్ నెక్స్ట్ సినిమా పై కూడా గాసిప్స్ మొదలయాయ్యి. అయితే మహేష్ నెక్స్ట్ కు గాను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఆల్రెడీ లైన్ లో ఉన్న సంగతి తెలిసిందే. కానీ ఇప్పుడు తన లాస్ట్ చిత్రం బిగ్గెస్ట్ హిట్ ఇచ్చిన అనీల్ రావిపూడి పేరు కూడా రేస్ లోకి వచ్చింది.

దీనితో మహేష్ ఎవరితో సినిమా చేస్తారన్న టాక్ ఇప్పుడు మొదలయ్యింది. ఇపుడు మహేష్ చేస్తున్న సర్కారు వారి పాట లో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నారు. అలాగే మైత్రి మూవీ మేకర్స్ అండ్ 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More