‘మిస్టర్ బాక్సాఫీస్’ నెక్స్ట్ పై పెరుగుతున్న హైప్.!

Published on Jul 6, 2021 7:03 am IST

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కి ఇండస్ట్రీలో ఉన్న మరో పేరే మిస్టర్ బాక్సాఫీస్.. డిజాస్టర్ టాక్స్ తో కూడా మినిమం వసూళ్లను చరణ్ రాబట్టేయగలడు అందుకే తన అభిమానులు చరణ్ ని అలా పిలుచుకుంటారు. అయితే మరి ఇప్పుడు చరణ్ నటిస్తున్న భారీ పాన్ ఇండియన్ మల్టీ స్టారర్ చిత్రం “రౌద్రం రణం రుధిరం” మరియు “ఆచార్య” సినిమాలు ఎనలేని అంచనాలు నెలకొల్పుకొని రెడీ అవుతున్నాయి.

మరి వీటిని మించిన అంచనాలు విజనరీ డైరెక్టర్ శంకర్ తో ప్లాన్ చేసిన బిగ్గెస్ట్ పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ పై నెలకొన్నాయి. కొన్నాళ్ల నుంచి అలా క్లారిటీ లేకుండా నడుస్తున్న ఈ ప్రాజెక్ట్ నుంచి మరోసారి అధికారిక క్లారిటీ రావడంతో మరోసారి హైప్ ఓ లెక్కలోకి వెళ్లింది. పైగా అప్డేట్స్ కూడా ఆన్ ది వే లో ఉన్నాయని కూడా కన్ఫర్మ్ కావడంతో మరిన్ని అంచనాలు నెలకొనడం మొదలైంది.. చరణ్, శంకర్ సహా నిర్మాత దిల్ రాజు కు కూడా బెంచ్ మార్క్ సినిమా ఇది కావడంతో అత్యంత ప్రతిష్టాత్మకంగానే మేకర్స్ తీసుకున్నారు. మరి వచ్చే సెప్టెంబర్ నాటికి చరణ్ సరికొత్త మేకోవర్ ని సిద్ధం చేసి షూట్ షురూ చేయనున్నాడు..

సంబంధిత సమాచారం :