“కేజీయఫ్ 2” ఆడియోపై మరింత ఇంట్రెస్టింగ్ సమాచారం.!

Published on Jul 3, 2021 7:03 am IST

కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించిన భారీ యాక్షన్ చిత్రం “కేజీయఫ్ చాప్టర్ 2” రిలీజ్ కి రెడీగా ఉన్న సంగతి తెలిసిందే. దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ సినిమా కోసం పాన్ ఇండియన్ లెవెల్లో ప్రేక్షకులు అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి ఇదిలా ఉండగా ఇటీవలే ఈ చిత్రం తాలూకా ఆడియో రైట్స్ పై లేటెస్ట్ సమాచారాన్ని మేకర్స్ ఇచ్చేసారు.

పైగా మన సౌత్ ఇండియన్ సినిమా దగ్గర భారీ ఫిగర్ ఈ సినిమా ఆడియోకి సొంతం అయ్యింది. మరి ఇప్పుడు ఈ సినిమా ఆడియోపై మరింత సమాచారం తెలుస్తుంది. ఈ చిత్రంలో మొత్తం 5 పాటలు ఉంటాయట. అలాగే చాప్టర్ 1 తరహాలో రెండు ట్యూన్స్ కథలో మిక్స్ అయ్యినవి కూడా ఉండనున్నట్టు తెలుస్తుంది.

ఇక మరో టాక్ ఏమిటంటే ఈ సినిమా ఫస్ట్ సింగిల్ వచ్చే ఆగష్టు మొదటి రెండు వారాల్లో వచ్చే అవకాశం ఉందని కన్నడ వర్గాలు చెబుతున్నాయి. పార్ట్ 1 కి అదరగొట్టేసింది సంగీత దర్శకుడు రవి బాసృర్ ఈ సారి ఎలాంటి మ్యూజిక్ ఇచ్చారా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి ఆ మోస్ట్ అవైటెడ్ ఫస్ట్ సింగిల్ ఎలా ఉండనుందో చూడాలి.

సంబంధిత సమాచారం :