మహేష్ బర్త్ డే కి “సర్కారు” నుంచి మాములుగా ఉండదా.?

Published on Aug 7, 2021 7:05 am IST


ప్రెజెంట్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ హీరోయిన్ గా దర్శకుడు పరశురాం పెట్ల కాంబోలో “సర్కారు వారి పాట” అనే పక్కా మాస్ అండ్ స్టైలిష్ ఎంటర్టైనర్ ని తెరకెక్కిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.. మరి మొన్ననే ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా మేకర్స్ వదలగా దానికి భారీ ఎత్తున రెస్పాన్స్ కూడా వచ్చింది. మరి ఇదిలా ఉండగా రానున్న ఆగస్ట్ 9 న మహేష్ బర్త్ డే కానుకగా మరో బ్లాస్టింగ్ గిఫ్ట్ ని కూడా మేకర్స్ రిలీజ్ చేస్తున్నామని కన్ఫర్మ్ చేసారు.

ఆ రోజు కోసం మహేష్ ఫ్యాన్స్ చాలా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. ఇక ఇదిలా ఉండగా ఆరోజు మాత్రం ఇంకా గట్టి ప్లానింగ్స్ ఉన్నాయని తెలుస్తోంది. ఆరోజు ఒక్క టీజర్ మాత్రమే కాకుండా మరో పోస్టర్ తో మహేష్ బర్త్ డేట్ ని మేకర్స్ స్టార్ట్ చెయ్యనున్నారట.. ఆ తర్వాత ఉదయం వీరు చెప్పిన బ్లాస్టర్ ను రిలీజ్ చేస్తారని తెలుస్తుంది.. అంతే కాదు ఇంకో అప్డేట్ ఏదో కూడా వదలనున్నట్టుగా కూడా ఊహాగానాలు వినిపిస్తున్నాయి.. మరి మొత్తానికి మాత్రం మహేష్ బర్త్ డే రోజున మామూలుగా ఉండేలా లేదని చెప్పాలి..

సంబంధిత సమాచారం :