“పుష్ప” ఫస్ట్ సింగిల్ లో మరిన్ని సర్ప్రైజ్ ఎలిమెంట్స్.?

Published on Aug 12, 2021 8:59 pm IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ని పాన్ ఇండియన్ లెవెల్లో ఓ రేంజ్ లో తీసుకెళ్లడానికి రెడీగా ఉన్న చిత్రం “పుష్ప”. దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ఇప్పుడు జస్ట్ ఫస్ట్ సింగిల్ కే భారీ హైప్ తెచ్చుకొని విడుదలకి రెడీ అవుతుంది. మరి అంతే కాకుండా రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో మొదటి పార్ట్ నుంచి మోస్ట్ అవైటెడ్ ఫస్ట్ సింగిల్ ను మేకర్స్ రేపు రిలీజ్ చెయ్యడానికి రెడీగా ఉన్నారు.

మరి రేపు ఉదయం 11 గంటల 7 నిమిషాలకు రిలీజ్ చెయ్యాలని ప్లాన్ చేసారు. అయితే మొత్తం 5 భాషల్లో కూడా రిలీజ్ కానున్న ఈ సాంగ్ పై మరింత ఇంట్రెస్టింగ్ సమాచారం వినిపిస్తుంది. ఒక ట్యూన్ గానే కాకుండా ఈ సాంగ్ చూపించే విజువల్స్ కూడా అవుట్ స్టాండింగ్ గా ఉంటాయట అలాగే బన్నీ వి కూడా కొన్ని స్టన్నింగ్ లుక్స్ ఈ సాంగ్ లో కనిపించనున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే వస్తున్న పోస్టర్స్ లో బన్నీ మాస్ లుక్ చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు.. ఇక ఈ సాంగ్ లో ఎలా ఉంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం :