ఆర్ ఆర్ ఆర్ లో అన్ని పాటలా…?

Published on Nov 7, 2019 8:39 am IST

ఆర్ ఆర్ ఆర్ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. విడుదల తేదీ దగ్గర పడుతున్న తరుణంలో రాజమౌళి ఎన్టీఆర్,చరణ్ లను షూటింగ్ లో బిజీ చేశేశారు. భారీ చిత్రం కావడంతో నిర్మాణాంతర కార్యక్రమాలకే నెలల సమయం పడుతుంది. అందుకే జక్కన్న కనీసం వచ్చే ఏడాది ఫిబ్రవరి కల్లా షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేయాలని టార్గెట్ పెట్టుకున్నారట. కాగా ఆర్ ఆర్ ఆర్ మూవీలో ఉత్కంఠ రేపే హై వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలతో పాటు, అలరించే పాటలు కూడా ఉంటాయట. కాగా ఆర్ ఆర్ ఆర్ మూవీలో దాదాపు ఏడు పాటలకు పైనే ఉంటాయని సమాచారం. దేశభక్తిని రగిలించే పేట్రియాటిక్ సాంగ్స్ తో పాటు, చరణ్ అలియా భట్ ల మధ్య ఒకటి లేదా రెండు రొమాంటిక్ సాంగ్స్ మరియు ఎన్టీఆర్ జోడీతో వచ్చే కొన్ని పాటలతో కలిపి మొత్తం ఏడు నుండి ఎనిమిది పాటలు ఉండే అవకాశం కలదట.

టాలీవుడ్ ప్రముఖ పాటల రచయితలలో ఒకరైన సుద్దాల అశోక్ తేజ తాను ఒక్కరే ఆర్ ఆర్ ఆర్ కొరకు మూడు పాటలు రాశానని చెప్పడం జరిగింది. ఈమూడు పాటలు ప్రముఖంగా దేశభక్తికి, స్వాతంత్ర్య కాంక్షను రగిలించేవిగా ఉంటాయని సమాచారం. ఇక మిగిలిన కొన్ని పాటలను ప్రముఖ లిరిసిస్ట్స్ తో రాజమౌళి రాయిస్తున్నారట. కాగా రాజమౌళి ఆస్థాన మ్యూజిక్ డైరెక్టర్ ఎం ఎం కీరవాణి ఈ మూవీకి సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

X
More