‘ఫిదా’ కు థియేటర్ల పెంపు !
Published on Jul 23, 2017 3:09 pm IST


గత శుక్రవారం విడుదలైన అన్ని సినిమాల్లోకి వరుణ్ తేజ్, శేఖర్ కమ్ముల కలయికలో వచ్చిన ‘ఫిదా’ సినిమా ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటోంది. విడుదలైన అన్ని ఏరియాల్లో ఆడియన్స్ ఈ చిత్రాన్ని బాగా ఆదరిస్తున్నారు. దీంతో పలు ప్రాంతాల్లో సినిమాకు ఇంకొన్ని థియేటర్లు పెంచనున్నారు. దీనికి తోడు ప్రస్తుతం థియేటర్లలో రన్ అవుతున్న చిత్రాల్లో ‘ఫిదా’ మంచి టాక్ సొంతం చేసుకోవడం, ఇంకొన్ని రోజుల వరకు భారీ సినిమాల రిలీజ్ లేకపోవడం ఈ చిత్ర వసూళ్లకు బాగా కలిసొచ్చే అంశాలు.

ఇప్పటికే ఈ సినిమా యూఎస్ లో 6 లక్షల డాలర్ల వరకు కలెక్ట్ చేసింది. ఇక ఏపీ, తెలంగాణల్లో కలిపి ఈ రెండు రోజుల్లో దాదాపు ఆరు కోట్ల పైనే షేర్ వసూలైనట్టు వినికిడి. ఈ సినిమాతో వరుణ్ తేజ్ ఖాతాలో తొలి కమర్షియల్ హిట్ నమోదైంది. ఇక ఈ ఇందులో వరుణ్ తేజ్ కు జోడీగా నటించిన సాయి పల్లవి నటనకు ప్రేక్షకులు, విమర్శకుల ప్రశంసలు దక్కుతున్నాయి. మ్యూజికల్ గా కూడా మంచి ఫీడ్ బ్యాక్ అందుకున్న ఈ చిత్రానికి శక్తి కాంత్ సంగీతం అందించారు.

 
Like us on Facebook