రేపే ‘మోసగాళ్ళకు మోసగాడు’ ఫస్ట్ టీజర్

రేపే ‘మోసగాళ్ళకు మోసగాడు’ ఫస్ట్ టీజర్

Published on Mar 20, 2015 1:00 PM IST

Mosagallaku-Mosagadu
కృష్ణ ఫ్యామిలీ నుంచి హీరోగా పరిచయమైన యంగ్ హీరో సుధీర్ బాబు వరుసగా తన సినిమాలను ఫినిష్ చేస్తున్నాడు. సుధీర్ బాబు ‘స్వామి రారా’ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న నిర్మాత చక్రి చిగురుపాటి కాంబినేషన్ లో ‘స్వామి రారా’ సినిమాకి సీక్వెల్ గా రూపొందిస్తున్న సినిమాకి ‘మోసగాళ్ళకు మోసగాడు’ అనే టైటిల్ ని ఖరారు చేసారని ఇది వరకే తెలియజేశాం. ఇటీవలే ఈ మూవీ ఫస్ట్ లుక్ ని కూడా రిలీజ్ చేసారు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ ని రేపు హైదరాబాద్ లో లాంచ్ చేయనున్నారు.

ఈ సినిమాలో సుధీర్ బాబు సరసన నందిని హీరోయిన్ గా కనిపించనుంది. ఇప్పటికే షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. నెల్లూరు బోస్ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ సినిమా కూడా స్వామి రారాలానే హిట్ అవుతుందని చక్రి చిగురుపాటి అంటున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను త్వరలోనే ఫినిష్ చేసి ఏప్రిల్ లో సినిమాని రిలీజ్ చేసేలా ఈ చిత్ర టీం ప్లాన్ చేస్తోంది. ఇదిలా ఉంటే సుధీర్ బాబు – నందిత జంటగా నటించిన ‘కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ’ సినిమా అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకొని రిలీజ్ కి సిద్దంగా ఉంది.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు