“మోసగాళ్లు” ట్రైలర్..ఇంట్రెస్టింగ్ అండ్ ఇంటెలిజెన్స్.!

Published on Feb 25, 2021 5:00 pm IST

మంచు వారి హీరో మంచు విష్ణు మరియు స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ లు మెయిన్ లీడ్ లో హాలీవుడ్ దర్శకుడు జెఫ్రీ గీ చిన్ దర్శకత్వంలో నిజ జీవిత ఘటనలు ఆధారంగా తెరకెక్కుతున్న ఇంట్రెస్టింగ్ చిత్రం “మోసగాళ్లు”. పోస్టర్ నుంచి టీజర్ వరకు మంచి హైప్ తో పలకరించిన చిత్ర యూనిట్ ఇప్పుడు ఫైనల్ గా ట్రైలర్ తో ముందుకొచ్చారు.

మెగాస్టార్ చిరంజీవి చేతులు మీదుగా విడుదల చేయించిన ఈ ట్రైలర్ ను కనుక గమనిస్తే మాంచి ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. ముఖ్యంగా మంచు విష్ణు రోల్ చాలా ఎంగేజింగ్ అండ్ ఇంటెలిజెన్స్ గా ఉందని చెప్పాలి. తాను పేద వాడిగా నుంచి తన టీం తో ప్రపంచంలోనే బిగ్గెస్ట్ స్కామ్ ఎలా చేస్తారు అన్నది ఈ ట్రైలర్ లో ఆసక్తిగా చూపించారు.

అందుకు తగ్గట్టుగానే మంచు విష్ణు కూడా ఇందులో సెటిల్డ్ గా కనిపిస్తున్నాడు. మరి అలాగే కాజల్ రోల్ కూడా ఇందులో ఆసక్తిగా అనిపిస్తుంది. వీరితో పాటుగా నవదీప్ కు కూడా ఇందులో మంచి రోల్ ఉన్నట్టు అనిపిస్తుంది. వీటితో పాటుగా ప్రతీ విజువల్ లో కూడా విష్ణు నిర్మాణ విలువలు అవుట్ స్టాండింగ్ గా కనిపిస్తున్నాయి. ఇక ఇందులో మరో ప్రధాన ఆకర్షణ మ్యూజిక్ డైరెక్టర్ సామ్ సి ఎస్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ అని చెప్పాలి.

ఇది సినిమాలో కూడా మరో లెవెల్లో ఉండడం ఖాయం అనిపిస్తుంది. ఓవరాల్ గా మాత్రం ఈ ట్రైలర్ ప్రామిసింగ్ గా ఉందని చెప్పాలి. ఇక భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ పాన్ ఇండియన్ చిత్రం తెలుగు, తమిళ్, హిందీ, మళయాళం మరియు కన్నడ భాషల్లో త్వరలో విడుదల కానుంది.

ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.

సంబంధిత సమాచారం :