అజిత్ తర్వాతే సూర్య..!

అజిత్ తర్వాతే సూర్య..!

Published on Apr 14, 2015 4:46 PM IST

ajith-surya
టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రిక ప్రతి ఏడాది మోస్ట్ డిజైరబుల్ మెన్ ర్యాంకులను ప్రకటిస్తున్న విషయం తెలిసిందే. ఈ అవార్డుల్లో తమ హీరో ర్యాంక్‌ను చూసి అభిమానులు మురిసిపోవడం ప్రతిసారీ జరిగేదే! 2014 సంవత్సరానికి గానూ మోస్ట్ డిజరైబుల్ మెన్ అవార్డు కోసం దేశవ్యాప్తంగా ఒక ఓటింగ్, చెన్నై, కొచ్చి, హైద్రాబాద్ లాంటి నగరాలకు నాలుగు క్యాటగిరీలుగా అవార్డుల కోసం ఓటింగ్ జరిగింది.

ఇందులో చెన్నైకి సంబధించి మోస్ట్ డిజైరబుల్ మెన్ పేరును ప్రకటించారు. కోలీవుడ్ సూపర్ స్టార్ అజిత్ మోస్ట్ డిజైరబుల్ మెన్‌గా ఎంపికయ్యారు. ఇదే ఓటింగ్‌లో సూర్య రెండో స్థానానికి పరిమితమయ్యారు. 2013లో మొదటి స్థానంలో ఉన్న ఆర్య ప్రస్తుతం ఐదో స్థానానికి పరిమితమయ్యారు. అజిత్, సూర్యల తర్వాత ధనుష్, విక్రమ్, ఆర్యలు వరుసగా మొదటి ఐదు స్థానాల్లో ఉన్నారు.

తాజా వార్తలు