స్మాల్ స్క్రీన్ సెన్సేషనల్ రియాలిటీ బిగ్ బాస్ సీజన్ 4 మన తెలుగులో అంతే ఎంటర్టైన్మెంట్ తో కొనసాగుతుంది. అన్ని రకాల ఎమోషన్స్ తో తెలుగు ఆడియెన్స్ కు దగ్గరైన ఈ షోలో ప్రతీ వారాంతం లానే నేడు కూడా ఎలిమినేషన్ ఉన్న సంగతి తెలిసిందే. అందుకు సంబంధించిన ప్రోమోను కూడా స్టార్ మా వారు లేటెస్ట్ గా విడుదల చేశారు.
ఇందులో చూసినట్లయితే ఇంతకు ముందు మేము ఇన్ఫార్మ్ చేసినట్టుగానే మెహబూబ్ దిల్ సే ఎలిమినేట్ అయ్యినట్టుగా క్లారిటీగా కనిపిస్తుంది. అయితే ఈ ఎలిమినేషన్ విషయంలో మాత్రం ప్రతీ ఒక్కరు చాలా ఎమోషనల్ అయ్యిపోయారు. నామినేషన్స్ లో ఉన్న వారు మాత్రమే కాకుండా హౌస్ లో ఉన్న అందరు కంటెస్టెంట్స్ ఈ ఎలిమినేషన్ పట్ల ఏడ్చేశారు.
ముఖ్యంగా షోయెల్ అయితే బాగా ఎమోషనల్ అయ్యాడు. ఇంతకు ముందు సీజన్స్ లో చూసినప్పుడు ఎలిమినేషన్స్ లో ఎందుకు అంతా ఓవర్ చేస్తున్నారు అనుకునే వాడిని అని కానీ మా వరకు వచ్చే సరికి ఆ నొప్పి తెలుస్తుంది అని అన్నాడు. అలాగే అభిజీత్ కూడా చాలా ఎమోషనల్ ఫీలవ్వడం నెటిజన్స్ లో హాట్ టాపిక్ అవుతుంది.
Elimination is always emotional #BiggBossTelugu4 today at 9 PM on @StarMaa#FestivalSunday pic.twitter.com/1GelbcZsGH
— Starmaa (@StarMaa) November 15, 2020


