‘తిప్ప‌రామీసం’.. మౌనం హృదయం రాగమే !

‘తిప్ప‌రామీసం’.. మౌనం హృదయం రాగమే !

Published on Oct 19, 2019 12:00 AM IST

శ్రీవిష్ణు హీరోగా నిక్కీ తంబోలి హీరోయిన్ గా రిజ్వాన్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌, కృష్ణ విజ‌య్ ఎల్ ప్రొడ‌క్ష‌న్‌, శ్రీ ఓం సినిమా ప‌తాకాల‌ పై కృష్ణ విజ‌య్‌.ఎల్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం `తిప్ప‌రామీసం`. కాగా తాజాగా ఈ సినిమా నుండి ‘మౌనం హృదయం రాగమే’ అనే సాంగ్ విడుద‌లైంది. హీరోహీరోయిన్లు తమ మనసుల్లోని ప్రేమ తాలూకు అంతరంగ భావాలను వ్యక్తపరుచుకునే సందర్భంలో ఈ పాట వస్తోంది. మొత్తానికి పాట ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా సురేశ్ బొబ్బిలి సంగీతం అలాగే పూర్ణ చారి సున్నితమైన సాహిత్యం, మరియు రంజని అద్భుతమైన గాత్రం పాటను మరో స్థాయిలో నిలబెట్టాయి.

కాగా ఇటివలే విడుదలైన ఈ సినిమా నెటిజన్లను బాగా ఆకట్టుకుంది. మొత్తానికి టీజ‌ర్‌కు అమేజింగ్ రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ సినిమాకి సురేశ్ బొబ్బిలి సంగీతం అందించారు. యాక్ష‌న్ రివేంజ్ డ్రామాగా రూపొందుతోన్న చిత్రానికి సిద్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. అలాగే ధ‌ర్మేంద్ర కాక‌రాల‌ ఎడిట‌ర్‌ గా వ్యవహరిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు