ధృవన్ కటకం, నియా త్రిపాఠి హీరో హీరోయిన్ లుగా నటిస్తున్న తాజా చిత్రం బలమెవ్వడు. ఈ సినిమా వైద్య రంగం లోని దోపిడీ ప్రస్నించనుంది. సత్య రాచకొండ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సనాతన దృశ్యాలు సమర్పణ లో ఆర్ బి మార్కండేయులు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం నుండి తాజాగా మౌనమా ఓడిపో అంటూ లిరికల్ వీడియో సాంగ్ ను చిత్ర యూనిట్ విడుదల చేయడం జరిగింది. ఈ పాట కి మంచి రెస్పాన్స్ వస్తోంది. అంతేకాక ఈ ప్రేమికుడు, ప్రేయసి ఎవరు? వారి మధ్య ప్రేమ ఎందుకు ఎలా పుట్టింది అన్ విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే అంటున్నారు దర్శక నిర్మాతలు.
మౌనమా ఓడిపో అనే పాట ను కళ్యాణ చక్రవర్తి రాయగా, అనురాగ్ కులకర్ణి, సాహితీ చాగంటి పాడటం జరిగింది. ఈ చిత్రానికి సంగీతం మణిశర్మ అందిస్తున్నారు. అయితే నిజ జీవిత ఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మణానంతర కార్యక్రమాలను జరుపుకుంటుంది. త్వరలో ఈ చిత్రం విడుదల తేదీ ను ప్రకటిస్తామని నిర్మాత మార్కండేయులు చెప్పుకొచ్చారు.


