‘మిస్టర్ మజ్ను’ అప్ డేట్ ఇవ్వనున్నాడు !

Published on Dec 6, 2018 7:59 pm IST

అక్కినేని యువ హీరో అఖిల్ నటిస్తున్న కొత్త చిత్రం ‘మిస్టర్ మజ్ను’ షూటింగ్ చివరిదశకు చేరింది. ఇక ఈ చిత్రం లోని మొదటి సాంగ్ ను ఎప్పుడు రిలీజ్ చేస్తారో రేపు ప్రకటించే అవకాశాలు ఉన్నాయని సమాచారం. ‘తొలిప్రేమ’ ఫేమ్ వెంకీ అట్లూరి తెరకెక్కిస్తున్న ఈచిత్రంలో అఖిల్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రంలో అఖిల్ ప్లే బాయ్ గా కొత్త లుక్ లో కనిపించనున్నాడు.

తమన్ సంగీతం అందిస్తున్న ఈ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ ను ఎస్విసిసి పతాకం ఫై బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఇక ‘అఖిల్ , హలో’ చిత్రాల తరువాత అఖిల్ నటిస్తున్న ఈ చిత్రం ఫై మంచి అంచనాలే వున్నాయి.

సంబంధిత సమాచారం :