మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో “మన శంకర వరప్రసాద్ గారు” అనే ఫుల్ కామెడీ ఎంటర్ టైనర్ రాబోతుంది. ఈ సినిమాలో మరో హీరో వెంకటేష్ కనిపించబోతున్న సంగతి తెలిసిందే. చిరంజీవి – వెంకటేష్ ఇద్దరూ కలిసి నటించిన మాస్ సాంగ్ ను, దాని ప్రోమోతో పాటుగా డిసెంబర్ 30న, 2025 విడుదల చేయనున్నట్లు ఇప్పటికే నిర్మాతలు ప్రకటించారు. కాగా తాజాగా ఈ పాటను గుంటూరులోని విజ్ఞాన్ యూనివర్సిటీలో విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది.
ఈ కార్యక్రమం మధ్యాహ్నం 3 గంటలకు ప్రత్యక్ష ప్రసారం కానుంది. ఈ ఈవెంట్ కి చిత్ర తారాగణం కూడా హాజరయ్యే అవకాశం ఉంది. ఈ సినిమాలో నయనతార, కేథరిన్ థ్రెసా, సునీల్, విటివి గణేష్, రేవంత్, హర్షవర్ధన్, సచిన్ ఖేడేకర్, అభినవ్ గోమఠం తదితరులు ఈ చిత్రంలో నటిస్తున్నారు. షైన్ స్క్రీన్స్ మరియు గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లపై సాహు గారపాటి, సుస్మిత (చిరంజీవి కుమార్తె) సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు, భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. కాగా ఈ సినిమా గురించి మెగాస్టార్ ఆ మధ్య మాట్లాడుతూ.. ‘ఈ సినిమా పూర్తిస్థాయి వినోదాత్మక చిత్రమని.. ఈ మూవీ కథ తనకు నచ్చిందని చిరు ఆల్ రెడీ చెప్పారు.


