వెంకీ – చైతుల మల్టీ స్టారర్ ప్రారంభం !

సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ , యువ సామ్రాట్ నాగ చైతన్య లు కలయికలో తెరకెక్కనున్న మల్టీ స్టారర్ చిత్రం ఈ రోజు రామానాయుడు స్టూడియో లో పూజా కార్యక్రమాలతో గ్రాండ్ గా లాంచ్ అయింది. కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కనున్న ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్ చైతు కు జోడి గా నటిస్తుంది. వెంకీ కి జోడిగా ఎవరిని తీసుకుంటారో తెలియాల్సి ఉంది.

‘జై లవ కుశ ‘చిత్ర దర్శకుడు బాబీ తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి వెంకీ మామ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. కోన వెంకట్, సురేష్ బాబు, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీలు కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.