ముద్ర అప్డేట్ వచ్చేసింది !

Published on Jan 13, 2019 6:31 pm IST

యువ హీరో నిఖిల్ నటిస్తున్న తాజా చిత్రం ‘ముద్ర’ గురించి ఎట్టకేలకు అప్డేట్ వెలుబడింది. 5 రోజుల టాకీ పార్ట్ తో ఒక సాంగ్ షూటింగ్ ను పూర్తి చేసుకుంటే ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తి కానుంది. తమిళంలో సూపర్ హిట్ అయినా ‘కనితన్’ కి రీమేక్ గా తెరకెక్కుతుంది ఈచిత్రం. ఇక ఇప్పటికే రెండు సార్లు రిలీజ్ డేట్ ప్రకటించి ఆ తరువాత విడుదలను వాయిదా వేశారు నిర్మాతలు. ఇక త్వరలోనే ఈ చిత్రం యొక్క టీజర్ విడుదల తేదీ తో పాటు సినిమా రిలీజ్ డేట్ ను కూడా ప్రకటించనున్నారు.

ఒరిజినల్ వెర్షన్ను డైరెక్ట్ చేసిన టి యెన్ సంతోష్ ఈ చిత్రాన్నీ తెరకెక్కిస్తుండగా నిఖిల్ సరసన లావణ్య త్రిపాఠి కథానాయికగా నటిస్తుంది. ఇక నిఖిల్ ప్రస్తుతం ఈ చిత్రం తో పాటు ‘శాస్వ’ అనే చిత్రంలో కూడా నటిస్తున్నాడు. నూతన దర్శకుడు కిషన్ కట్టా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

X
More