యువ హీరో నిఖిల్ నటిస్తున్న తాజా చిత్రం ‘ముద్ర’. షూటింగ్ ని పూర్తి చేసుకొని ప్రస్తుతం నిర్మాంతర కార్యక్రమాలు జరుపుకుంటుంది. ఇక ఈచిత్రాన్ని నవంబర్ 8న విడుదలచేయాలనుకున్నారు అదే సమయంలో రెండు భారీ అనువాద చిత్రాలు విడుదల అవుతుండడంతో ఈ చిత్రాన్ని వాయిదా వేశారు.
తాజాగా ఈచిత్ర విడుదల తేదీని ఖరారు చేసారు చిత్ర నిర్మాతలు. డిసెంబర్ 28న సోలో గా ముద్ర థియేటర్లలో సందడి చేయనుంది. నిఖిల్ జర్నలిస్ట్ పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం తమిళ్ లో విజయం సాధించిన ‘కనితన్’ సినిమాకి రీమేక్ గా తెరెకెక్కుతుంది . టి.ఎన్ సంతోష్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో నిఖిల్ కొత్త లుక్ లో కనిపించనున్నాడు.
థ్రిల్లర్ నేపథ్యంలో రానున్న ఈచిత్రంలో నిఖిల్ సరసన లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటిస్తున్నారు. సామ్ సి ఎస్ సంగీతం అందిస్తున్నాడు. కావ్య వేణుగోపాల్ మరియు రాజ్ కుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.


