సెకండ్ షెడ్యూల్లో నిఖిల్ ‘ముద్ర’ !

Published on Jul 17, 2018 12:48 am IST

‘కిరాక్ పార్టీ’ చిత్రం తరువాత యువ హీరో నిఖిల్ నటిస్తున్న తాజా చిత్రం ‘ముద్ర’. తమిళ భాషలో ఘన విజయం సాధించిన సాధించిన ‘కనితన్’ సినిమాకి రీమేక్ గా తెరకెక్కుతుంది ఈ చిత్రం. ఒరిజినల్ వెర్షన్ ను తెరకెక్కించిన టి.ఎన్ సంతోషే ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈచిత్ర రెండో షెడ్యూల్ శరవేగంగా జరుగుతుంది.

నిఖిల్ జర్నలిస్ట్ పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటిస్తుంది. ఇటీవల ఈ చిత్రం యొక్క శాటిలైట్ హక్కులు భారీ ధరకు అమ్ముడయ్యాయి ప్రముఖ ఛానల్ 5. 5 కోట్లకు దక్కించుకుందని సమాచారం. ప్రముఖ నిర్మాత ఠాగూర్ మధు నిర్మిస్తున్న ఈ చిత్రంలో పోసాని కృష్ణ మురళి, వెన్నెల కిశోర్ మొదలైన వారు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

X
More