ఉదయం 05.18 గంటలకు ‘గోవిందుడు..’గా రామ్ చరణ్.

Published on Sep 25, 2014 5:45 pm IST

GAV-(3)
అక్టోబర్ 1న విడుదలవుతున్న ‘గోవిందుడు అందరివాడేలే’ ప్రమోషనల్ కార్యక్రమాలను షురూ చేశారు. అక్టోబర్ 1, భుదవారం ఉదయం 5 గంటల 18 నిముషాలకు తొలి ఆట ప్రదర్శిస్తున్నట్టు నిర్మాత బండ్ల గణేష్ తెలియజేశారు. దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా అత్యధిక థియేటర్లలో విడుదల కానుంది. తొలిసారిగా రామ్ చరణ్ ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ లో నటించడం, క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశి దర్శకుడు కావడంతో ఈ సినిమాపై భారి అంచనాలు నెలకొన్నాయి.

సినిమాలో క్లైమాక్స్ 30 నిముషాలు ప్రేక్షకుల హృదయాలను కదిలించేలా కృష్ణవంశి తెరకెక్కించారని నిర్మాత తెలిపారు. రామ్ చరణ్ సరసన కాజల్ అగర్వాల్ నటించిన ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, జయసుధ, శ్రీకాంత్, కమలిని ముఖర్జీ ముఖ్య పాత్రలు పోషించారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు. పరమేశ్వరా ఆర్ట్ ప్రొడక్షన్ పతాకంపై బ్లాక్ బస్టర్ ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ ఈ సినిమాను నిర్మించారు.

సంబంధిత సమాచారం :