భారీ ప్రాజెక్ట్ “సలార్” కు ముహూర్తం ఫిక్స్ అయ్యింది.!

Published on Jan 14, 2021 12:09 pm IST

పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ మరియు సెన్సేషనల్ చిత్రం కేజీయఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ల కాంబోలో లేటెస్ట్ గా అనౌన్స్ చేసిన బిగ్గెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ ప్రాజెక్ట్ “సలార్”. జస్ట్ అనౌన్స్మెంట్ మరియు టైటిల్ లుక్ పోస్టర్ తోనే పాన్ ఇండియన్ లెవెల్లో భారీ అంచనాలు నెలకొల్పుకున్నా ఈ చిత్రం ఎప్పుడు మొదలు కానుందా అని ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక అలాగే చిత్రానికి సంబంధించి అప్పుడు అప్డేట్ తోనే ఈ మొదలు కానుంది టాక్ వచ్చింది.

ఇప్పుడు అందుకు తగ్గట్టుగానే ఈ చిత్రం ముహుర్తాన్ని కుదుర్చుకుంది. అది కూడా ఇప్పుడు ఈ జనవరి 15నే ఫిక్స్ అయ్యింది. ఈ ముహూర్తం పూర్తయ్యాక ఈ భారీ చిత్రం ఇంకో వారం వ్యవధిలోనే మొదలు కానుంది. ఇప్పటికే నీల్ ప్లాన్ అంతా సిద్ధం చేసేసారు. అలాగే సాధ్యమైనంత త్వరగా ఈ చిత్రాన్ని ప్రభాస్ అండ్ టీం ఫినిష్ చేసేయాలని సన్నాహాలు చేస్తున్నారు. మరి ఈ చిత్రాన్ని నీల్ ఏ స్థాయిలో తెరకెక్కిస్తాడో చూడాలి. మరి ఈ చిత్రాన్ని కూడా కేజీయఫ్ మేకర్స్ హోబలే నిర్మాణ సంస్థ వారు నిర్మించనున్న తెలిసిందే.

సంబంధిత సమాచారం :

More