మెగా ప్రిన్స్ ‘గని’ రిలీజ్ కి ముహూర్తం ఖరారు.?

Published on Aug 5, 2021 2:01 pm IST

ప్రస్తుతం మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా సాయీ మంజ్రేకర్ హీరోయిన్ గా “గని” అనే ఇంటెన్స్ బాక్సింగ్ డ్రామా చిత్రం చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. మొదటి నుంచి కూడా మంచి హైప్ ను ఈ చిత్రంను దర్శకుడు కిరణ్ కొర్రపాటి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో ఇప్పుడు ఫైనల్ రౌండ్ సాలిడ్ యాక్షన్ షూట్ నడుస్తుంది.

అయితే ఈ చిత్రం నిజానికి గత జూలై 30న రిలీజ్ కావాల్సి ఉండగా అన్ని సినిమాలతో పాటే ఇది కూడా వాయిదా పడింది. మరి ఇప్పుడు ఈ చిత్రం రిలీజ్ కి కూడా ముహూర్తం కుదిరినట్టు తెలుస్తుంది. తాజా టాక్ ప్రకారం ఈ చిత్రాన్ని మేకర్స్ రాబోతున్న దీపావళి కానుకగా రిలీజ్ చెయ్యాలని సన్నాహాలు చేస్తున్నారట.

మరి దీనిపై అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా సిద్ధూ ముద్దా మరియు అల్లు బాబీలు నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :