ఇంట్రెస్టింగ్ గా “ముఖచిత్రం” ట్రైలర్.!

Published on Dec 1, 2022 11:07 am IST

ఈ డిసెంబర్ లో రిలీజ్ కి రెడీగా ఉన్న లేటెస్ట్ చిత్రాల్లో మాస్ కా దాస్ విశ్వక్ సేన్ గెస్ట్ రోల్ లో నటించిన చిత్రం “ముఖచిత్రం” కూడా రెడీగా ఉంది. మరి ఈ చిత్రంలో అయితే వికాస్ వసిష్ఠ హీరోగా ప్రియ వడ్లమని మరియు చైతన్య రావ్ లు హీరోయిన్స్ గా నటించిన ఈ చిత్రాన్ని యంగ్ దర్శకుడు సందీప్ రాజ్ తెరకెక్కించాడు. మరి ఈ చిత్రం నుంచి అయ్యితే ఇప్పుడు మేకర్స్ థియేట్రికల్ ట్రైలర్ ని రిలీజ్ చేశారు.

మరి ఈ ట్రైలర్ మంచి ఆసక్తిగా ఉందని చెప్పాలి. స్టార్టింగ్ ట్రై యాంగిల్ లవ్ స్టోరీ అంటూ ఓ ప్రేమ కథలా మొదలైనా నెక్స్ట్ మాత్రం ఇంట్రెస్టింగ్ అంశాలతో ట్విస్టులతో ప్రామిసింగ్ గా మారింది. ఒకమ్మాయి ముఖాన్ని ఇంకో అమ్మాయికి మార్చడం హీరో పాత్రకి వారి ఇద్దరికీ ఉన్న కనెక్షన్ ఏంటి దాని వల్ల ఏమవుతుంది అనే అంశాలు ఎగ్జైటింగ్ గా ఉన్నాయి.

మరి హీరో వికాస్ తన రోల్ లో మంచి ఎనర్జిటిక్ గా క్లారిటీ గా కనిపిస్తుండగా ఇద్దరు హీరోయిన్స్ తమ డీసెంట్ లుక్స్ సహా ఇంటెన్స్ పెర్ఫార్మన్స్ తో ఆకట్టుకునేలా కనిపిస్తున్నారు. అలాగే వెర్సటైల్ డబ్బింగ్ ఆర్టిస్ట్ మరియు నటుడు రవిశంకర్ మరియు విశ్వక్ సేన్ ల మధ్య కోర్ట్ డ్రామా మరింత ఆసక్తి రేపగా ట్రైలర్ లో లాస్ట్ ట్విస్ట్ ఇంప్రెసివ్ గా ఉంది.

ఇంకా ఈ ట్రైలర్ మెయిన్ హైలైట్ కళా భైరవ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ అని చెప్పాలి. ఈ ట్రైలర్ సినిమా నేపథ్యానికి సాలిడ్ వర్క్ ని తాను అందించి మరింత టెన్స్ వాతావరణం తీసుకొచ్చాడు. మరి ఈ డిసెంబర్ 9న థియేటర్స్ లో రానున్న ఈ చిత్రం ఎలాంటి స్పందన అందుకుంటుందో చూడాలి. ఇక ఈ చిత్రాన్ని అయితే పాకెట్ మంకీ పిక్చర్స్ వారు నిర్మాణం వహించగా ఎస్ కె ఎన్ ప్రెజెంట్ చేస్తున్నాడు.

ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం :