మల్టీస్టారర్ ట్రైలర్ రేపే విడుదల..!

Published on May 19, 2019 8:40 pm IST


ఆండ్రూ లూయిస్‌ దర్శకత్వంలో క్రేజీ హీరో విజయ్ ఆంటోని, యాక్షన్ కింగ్ అర్జున్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో తెరకెక్కిన చిత్రం ‘కొలైగారన్‌’. దియా మూవీస్‌ బ్యానర్ తమిళంలో నిర్మించిన ఈ సినిమాని పారిజాత మూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌పై టి.నరేష్‌కుమార్‌–టి.శ్రీధర్‌ ‘కిల్లర్‌’ పేరుతో తెలుగులో విడుదల చేస్తున్నారు.

మర్డర్‌ మిస్టరీ, క్రైౖమ్‌ థ్రిల్లర్‌ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ సినిమాలో అషిమా కథానాయికగా నటించారు. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. జూన్ తొలి వారంలో సినిమా రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా ఈ చిత్రం ట్రైలర్ ని రేపు రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర నిర్మాతలు ప్రకటించారు.

ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్ ని చూస్తే విజ‌య్ ఆంటోని.. యాక్ష‌న్ కింగ్ అర్జున్ పోటాపోటీగా న‌టించారని అర్ధం అవుతుంది. సైమ‌న్.కె.కింగ్ సంగీతం సమకూరుస్తున్న ఈ సినిమా కి మాక్స్ సినిమాటోగ్రఫీ ని అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More