రామచంద్ర వట్టికూటి దర్శకత్వంలో రమణ్, వర్షా విశ్వనాథ్ హీరో–హీరోయిన్లుగా నటిస్తున్న ‘మటన్ సూప్’ చిత్రంలోని మాస్ ఎనర్జిటిక్ సాంగ్ ‘కల్లు కొట్టు కాడ’ ను ప్రముఖ నటుడు మురళీ మోహన్ గారు విడుదల చేశారు.
సూరన్న రచన, వెంకీ వీణ బాణీ, సూరన్న–రేలారే రేలా గోపాల్–సుజాత వాసు గానం ఈ పాటకు హైలైట్గా నిలిచాయి. లిరికల్ వీడియోలో సత్య మాస్టర్ కొరియోగ్రఫీ ప్రత్యేక ఆకర్షణ.
సాంగ్ లాంచ్ సందర్భంగా మురళీ మోహన్ గారు, “‘మటన్ సూప్’ టైటిల్, పాట రెండూ బాగున్నాయి. యంగ్ టీమ్ చేసిన ఈ ప్రయత్నం విజయవంతం కావాలి” అని ఆశీర్వదించారు. దర్శకుడు రామచంద్ర వట్టికూటి, నిర్మాతలు మల్లిఖార్జున ఎలికా (గోపాల్), రామకృష్ణ సనపల తమ కృతజ్ఞతలు తెలుపుతూ, “సినిమాను త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తాం” అన్నారు.
హీరో రమణ్ కూడా మూవీపై నమ్మకం వ్యక్తం చేస్తూ, ఇది తప్పక హిట్ అవుతుందని విశ్వాసం తెలిపారు.


