లెజెండరీ క్రికెటర్ పాత్రలో స్టార్ హీరో.

Published on Jul 24, 2019 8:37 pm IST

ప్రపంచంలో ఉన్న ,మేటి స్పిన్ బౌలర్లలో ముత్తయ్య మురళీధరన్ ఒకరు. శ్రీలంకకు చెందిన ఈ మేటి ఆఫ్ స్పిన్నర్ లెక్కకు మించి రికార్డులను నెలకొల్పడం జరిగింది. ఇతను శ్రీలంకకు చెందిన వాడైన తమిళనాడుతో సంబంధాలు కలిగివున్నాడు. 2005లో మురళీధరన్ చెన్నైకి చెందిన మధిమలార్ రామమూర్తి అనే అమ్మాయిని వివాహం చేసుకున్నాడు.

ఐతే ఇప్పుడు ఈ లెజెండరీ క్రికెటర్ బయోపిక్ కి రంగం సిద్ధమైంది. విలక్షణ నటుడు విజయసేతుపతి మురళిధరన్ గా నటించనున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ దార్ మోషన్ పిక్చర్స్ మరో ప్రముఖ నిర్మాణ సంస్థతో కలిసి ఈ బయోపిక్ నిర్మించనున్నారని సమాచారం. త్వరలో సెట్స్ పైకెళ్లనున్న ఈ చిత్రం 2020 చివర్లో విడుదలయ్యే అవకాశం కలదు. ఈ చిత్రంలో నటించే మిగతా నటులు, పనిచేసే సాంకేతిక నిపుణుల వివరాలు తెలియాల్సివుంది.

సంబంధిత సమాచారం :