బిగ్ స్క్రీన్స్‌పై సందడి చేయనున్న “సర్కారు వారి పాట” మాస్ మెలోడీ..!

Published on Jun 2, 2022 1:41 am IST

సూపర్ స్టార్ మహేశ్ బాబు, కీర్తి సురేష్ జంటగా పరశురామ్ పెట్ల దర్శకత్వంలో వచ్చిన చిత్రం “సర్కారు వారి పాట”. మైత్రీ మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్ మరియు 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌లపై నిర్మించిన ఈ చిత్రం మే 12న థియేటర్స్‌లో విడుదలై హిట్ టాక్‌ని అందుకోవడమే కాకుండా.. బాక్సాఫీస్ వద్ద భారీగానే కలెక్షన్లను రాబట్టుకుంది.

ఇదిలా ఉంటే ఈ సినిమా మాస్ మెలోడీ సాంగ్ “మురారివా” పాటను బిగ్ స్క్రీన్స్‌కి అటాచ్ చేశారు. ఇక ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించగా, నదియా, వెన్నెల కిషోర్, సుబ్బరాజు, సముద్ర ఖని, తనికెళ్ళ భరణి తదితరులు కీలక పాత్రల్లో నటించారు.

సంబంధిత సమాచారం :