మ్యూజిక్ సిట్టింగ్స్ లో నితిన్ రంగ్ దే

Published on Aug 27, 2019 7:22 pm IST

యంగ్ హీరో నితిన్ దర్శకుడు వెంకీ అట్లూరి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ రంగ్ దే. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తుండగా కీర్తి సురేష్ నితిన్ సరసన నటిస్తుంది. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ చిత్ర మ్యూజిక్ కంపొజిషన్ నేడు మొదలైంది.

రాక్ స్టార్ దేవిశ్రీ ఈ మూవీకి స్వరాలు సమకూరుస్తున్నారు. ఈ సందర్భంగా మ్యూజిక్ థియేటర్లో దర్శకుడు వెంకీ, దేవిశ్రీ కలిసిదిగిన ఫోటోలు సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. మంచి మెలోడియస్ పాటలతో పాటు, బీట్ సాంగ్స్ కలగలిపి రంగ్ దే చిత్రం కొరకు దేవిశ్రీ మంచి ఆల్బం ప్రిపేర్ చేస్తున్నారట. వచ్చే ఏడాది వేసవి కానుకగా ఈ చిత్రం విడుదల కానుంది.

సంబంధిత సమాచారం :