‘అందాల రాక్షసి’, ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’ చిత్రాలతో మంచి పేరు తెచ్చుకున్న హను రాఘవపూడి తాజాగా శర్వానంద్ తో పడిపడి లేచే మనసు అనే డిఫరెంట్ టైటిల్ తో సినిమా చేస్తున్నాడు. ఫిబ్రవరి మొదటివారం నుండి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. సాయి పల్లివి హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమా అందమైన ప్రేమ కథగా తెరకెక్కించబోతున్నాడు దర్శకుడు హను రాఘవపుడి.
ఈ సినిమాకు విశాల్ చంద్రశేఖర్ స్వరాలు సమకూరుస్తున్నాడు, గతంలో విశాల్ చంద్రశేఖర్, హను రాఘవపుడిల కాంబినేషన్లో ‘క్రిష్ణగాడి వీర ప్రేమగాద’ సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకోసం శర్వానంద్ డిఫరెంట్ లుక్ లో కనిపించబోతున్నాడు. ‘ఫిదా’ సినిమా తరువాత సాయి పల్లవికి చాలా సినిమా ఆఫర్స్ వస్తోన్నా కథ నచ్చడంతో ఈ సినిమా చెయ్యడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
