రామ్ పోతినేని ప్రాజెక్ట్‌లోకి ఎంట్రీ ఇచ్చిన మ్యూజిక్ డైరెక్టర్.. ఎవరంటే..?

రామ్ పోతినేని ప్రాజెక్ట్‌లోకి ఎంట్రీ ఇచ్చిన మ్యూజిక్ డైరెక్టర్.. ఎవరంటే..?

Published on Jul 7, 2026 7:01 PM IST

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా నటిస్తూ తొలిసారి తానే డైరెక్ట్ చేస్తున్న లేటెస్ట్ యాక్షన్ చిత్రం ఇటీవల అధికారికంగా ప్రారంభమైంది. ఈ చిత్రాన్ని ‘#RAPO23’ అనే ట్యాగ్‌తో తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించి మేకర్స్ తాజాగా ఓ సాలిడ్ అప్డేట్ ఇచ్చారు. ఈ చిత్రానికి సంగీతం ఎవరు అందిస్తున్నారనే విషయాన్ని చిత్ర యూనిట్ రివీల్ చేసింది.

ఈ సినిమాకు ప్రముఖ సంగీత దర్శకుడు సామ్ సిఎస్ సంగీతం అందించబోతున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటిస్తూ ఒక స్పెషల్ గ్లింప్స్‌ను విడుదల చేశారు. ‘ప్రతి ప్రపంచానికి ఒక శబ్దం ఉంటుంది.. ఈ ప్రపంచం విధ్వంసాన్ని శ్వాసిస్తోంది’ అంటూ సామ్ సిఎస్ ఎంట్రీని చిత్ర యూనిట్ ఘనంగా స్వాగతించింది. రామ్ పోతినేని నటిస్తున్న ఈ ఇంటెన్స్ యాక్షన్ డ్రామాకు ఆయన అందించబోయే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు హైలైట్‌గా నిలవనుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.

ఇక ఈ చిత్రాన్ని రాపో సినిమాటిక్స్ బ్యానర్‌పై కృష్ణ పోతినేని నిర్మిస్తుండగా తిరు సినిమాటోగ్రాఫర్‌గా, పీటర్ హెయిన్ యాక్షన్ కొరియోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు