సూపర్ స్టార్ తో విజయ్…సరికొత్త ఫొటో ను షేర్ చేసిన థమన్

Published on Aug 7, 2021 1:00 am IST


సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం సర్కారు వారి పాట. ఈ చిత్రానికి సంగీతం థమన్ అందిస్తున్నారు. అయితే మహేష్ బాబు పుట్టిన రోజు దగ్గర పడుతుండటం తో అభిమానులు సోషల్ మీడియా లో మహేష్ బాబు ట్యాగ్ ను, సర్కారు వారి పాట కు సంబంధించిన అప్డేట్స్ ను తెగ షేర్ చేస్తూ వైరల్ చేస్తున్నారు. అయితే ఇటీవల సర్కారు వారి పాట టీమ్ మహేష్ బాబు ఫోటో ను షేర్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. కార్ లో నుండి దిగుతూ స్టైల్ గా కనిపిస్తున్న పోస్టర్ ను చిత్ర యూనిట్ షేర్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు ఆ ఫోటో ను అభిమానులు తమకు నచ్చిన విధంగా ఎడిట్ చేస్తున్నారు.

అయితే ఈ నేపథ్యం లో తమిళ నాట స్టార్ హీరో అయిన విజయ్ ఫోటో ను సూపర్ స్టార్ మహేష్ బాబు తో ఉన్న ఫోటో ను కలిపి ఎడిట చేయడం జరిగింది. అది కాస్త వైరల్ అయ్యింది. అయితే సంగీత దర్శకులు థమన్ సైతం ఆ ఫోటో ను సోషల్ మీడియాలో షేర్ చేయడం జరిగింది. అయితే నెటిజన్లు, అభిమానులు ఈ ఫోటో కి లైక్స్ కొడుతూ షేర్ చేస్తున్నారు. విజయ్ కి ఇక్కడ కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండటం తో మ్యూచువల్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న సర్కారు వారి పాట చిత్రం కి సంబంధించిన మరికొన్ని అప్డేట్స్ మహేష్ పుట్టిన రోజున రానున్నాయి. ఈ చిత్రం లో మహేష్ సరసన హీరోయిన్ గా కీర్తీ సురేష్ నటించగా, ఈ చిత్రానికి పరశురామ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం ను వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో దింపేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.

సంబంధిత సమాచారం :