నా చిత్రం పెరుగన్నం లాంటిది – దర్శకుడు పవన్ ప్రభ

నా చిత్రం పెరుగన్నం లాంటిది – దర్శకుడు పవన్ ప్రభ

Published on May 26, 2025 9:16 AM IST

pra

డా. రాజేంద్ర ప్రసాద్, నటి అర్చన ప్రధాన పాత్రల్లో రూపేశ్ హీరోగా, నిర్మాతగా మా ఆయి ప్రొడక్షన్స్ పతాకంపై పవన్ ప్రభ తెరకెక్కించిన చిత్రం ‘షష్టిపూర్తి’. ఈ మూవీలో ఆకాంక్ష సింగ్ ప్రధాన పాత్రను పోషించారు. ఈ సినిమాను మే 30న విడుదల చేయబోతోన్నారు. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న క్రమంలో దర్శకుడు పవన్ ప్రభ ‘షష్టిపూర్తి’ గురించి ఎన్నో విషయాల్ని పంచుకున్నారు. ఆయన చెప్పిన సంగతులివే..

దర్శకుడు పవన్ ప్రభ మాట్లాడుతూ.. ‘నేను హోటల్ మేనేజ్మెంట్ చేశాను. మా ఇంట్లో అంతా ట్రెడిషనల్ సింగర్సే ఉంటారు. నాకు చిన్నతనం నుంచే సినిమాలపై మక్కువ ఏర్పడింది. సినిమాలతోనే మనం మంచిని చెప్పగలమని నమ్ముతాను. అలా నేను చివరకు ఇండస్ట్రీలోకి వచ్చాను. నేను ఈ ‘షష్టిపూర్తి’ గురించి చాలా చోట్ల తిరిగాను. ఇళయరాజా గారు కావాల్సిందే అని ముందు నుంచీ ఫిక్స్ అయ్యాను. అమ్మానాన్నల గొప్పదనాన్ని, ప్రేమ విలువను చెప్పాలనే ఉద్దేశంతోనే ‘షష్టిపూర్తి’ని తీశాను. ఇప్పటి వరకు ‘షష్టిపూర్తి’ గురించి చూసిన దాని కంటే మే 30వ తేదీని మీరు సర్ ప్రైజ్ అయ్యే అంశాలెన్నో సినిమాలో ఉంటాయి’ అని అన్నారు.

దర్శకుడు పవన్ ప్రభ ఇంకా మాట్లాడుతూ.. ‘షష్టిపూర్తి’ విషయంలో నేను ముందు నుంచీ చాలా క్లారిటీతో ఉన్నాను. రాజేంద్ర ప్రసాద్ గారు, అర్చన గారిని నేను మళ్లీ రెండో టేక్ అని అడగాలంటే ఎంత ధైర్యం కావాలి. ఎందుకు అని వారు ప్రశ్నిస్తే.. సమాధానం చెప్పేలా, క్లారిటీ ఇచ్చే స్థాయిలో నేను ప్రిపేర్ అవ్వాలి. ‘షష్టిపూర్తి’ ట్రైలర్‌ను అందరూ మెచ్చుకుంటారు. సినిమాలో ఏదో విషయం ఉందని అంతా అంటున్నారు. మరీ ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ గురించి మాట్లాడుతున్నారు. అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ చిత్రంలో కొంత వింటేజ్ పార్ట్ కూడా ఉంటుంది. పాటల సిట్యువేషన్‌ను తీసేసి కథను చెప్పమని ఇళయరాజా గారు అన్నారు. ఎక్కడ పాట రావాలో నేను చెబుతాను అని ఆయనే చెప్పారు. ఇక ఫస్ట్ కంపోజిషన్ కోసం మళ్లీ వెళ్లాం. సిట్యువేషన్ చెప్పిన వెంటనే హార్మోనియం మీద పల్లవి ప్లే చేసి వినిపించారు. అన్ని పాటల్ని క్షణాల్లో కంపోజ్ చేసి ఇచ్చారు. రూపేశ్, ఆకాంక్ష ఇద్దరూ అద్భుతంగా నటించారు. కొన్ని రోజుల పాటు ఈ చిత్రం అందరినీ వెంటాడుతూ ఉంటుంది. నా చిత్రం పెరుగన్నం లాంటిది. సెన్సార్‌ వాళ్లు మా చిత్రానికి ఒక్క కట్ కూడా చెప్పలేదు’ అని అన్నారు.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు