నా తల్లిదండ్రులు ఆ విషయంలో చాలా బాదపడ్డారు – రష్మిక

Published on Aug 6, 2021 3:00 am IST

యంగ్ బ్యూటీ రష్మిక మందన్న ప్రస్తుతం టాలీవుడ్, బాలీవుడ్‌లో వరుస ప్రాజెక్టులతో బిజీగా బిజీగా గడుపుతున్నారు. బాలీవుడ్‌లో మిషన్ మజ్ఞు మరియు గుడ్‌బై సినిమాల తర్వాత ముంబై నుంచి హైదరాబాద్‌కు తిరిగివచ్చిన రష్మిక ప్రస్తుతం అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న “పుష్ప” మరియు శర్వానంద్ హీరోగా నటిస్తున్న “ఆడాళ్లు మీకు జోహార్లు” సినిమా షూటింగ్‌లలో బిజీగా ఉంది.

అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన రష్మిక కరోనా సమయంలో తన బిజీ షెడ్యూల్ కారణంగా తన తల్లిదండ్రులు చాలా కలత చెందారని, ప్రస్తుతం పరిస్థితుల నేపధ్యంలో నా షూటింగ్‌లను వాయిదా వేసుకోమని కోరారని అయితే నాపై వారి ప్రేమ నన్ను ఒకింత ఎమోషన్‌కి గురిచేసిందని అన్నారు. షూటింగ్‌లను వాయిదా వేయడం తన చేతిలో లేదని, అందుకే అన్ని జాగ్రత్తలు పాటిస్తూ షూటింగ్‌లలో పాల్గొంటున్నానని చెప్పుకొచ్చింది.

సంబంధిత సమాచారం :