టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్‌ని ప్రకటించింది. ఇప్పటివరకు ఈ బ్యానర్ టచ్ చేయని జోనర్‌తో తమ నెక్స్ట్ సినిమాను తీసుకొస్తున్నారు. ఈసారి ప్యూర్ హారర్ జోనర్‌లో సినిమాను రూపొందిస్తున్నట్లు మైత్రీ మూవీ మేకర్స్ తాజాగా ప్రకటించారు. ఈ చిత్రానికి ‘418’ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్‌ను మేకర్స్ ఫిక్స్ చేశారు.
సాధారణంగా హారర్ సినిమాల్లో కామెడీ జోడించి హారర్-కామెడీ చిత్రాలను తెరకెక్కించడం ఇటీవల ట్రెండ్‌గా మారింది. కానీ ‘418’ చిత్రంతో అసలైన భయాన్ని రుచి చూపించబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. “హారర్ సినిమాల్లో నవ్వుకున్నది చాలు.. ఇక భయపడే సమయం వచ్చింది” అంటూ సినిమాపై అంచనాలను పెంచేశారు. ఈ చిత్రానికి మరో ప్రత్యేకత ఏమిటంటే, పాన్ ఇండియా దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ సినిమాను సమర్పిస్తున్నాడు.
ప్రశాంత్ నీల్ బ్రాండ్ తోడవ్వడంతో ఈ హారర్ థ్రిల్లర్‌పై ఇండస్ట్రీలో చర్చ మొదలైంది. కీర్తన్ నడగౌడ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సూర్య రాజ్, చరణ్ లక్కరాజు, ప్రీతి పగడాల ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. మరి ప్యూర్ హారర్ ఎలిమెంట్స్‌తో రాబోతున్న ఈ సినిమా ప్రేక్షకులను ఎంతమేర భయపెట్టనుందో చూడాలి.


