ఓటిటి రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న “నా సామిరంగ”

ఓటిటి రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న “నా సామిరంగ”

Published on Feb 10, 2024 10:43 AM IST

మన టాలీవుడ్ కింగ్ నాగార్జున హీరోగా యంగ్ అండ్ బ్యూటిఫుల్ హీరోయిన్ ఆషిక రంగనాథ్ హీరోయిన్ గా టాలెంటెడ్ నటుడు అల్లరి నరేష్ కీలక పాత్రలో దర్శకుడు విజయ్ బిన్నీ తెరకెక్కించిన సూపర్ హిట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రం “నా సామిరంగ”. మరి ఈ సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ చిత్రం నాగార్జున కెరీర్ లో మరో సంక్రాంతి బ్లాక్ బస్టర్ గా నిలిచి అదరగొట్టింది. మరి ఈ చిత్రం అయితే ఇప్పుడు ఫైనల్ గా ఓటిటి రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసుకుంది.

ఈ సినిమా తాలూకా స్ట్రీమింగ్ హక్కులని ప్రముఖ ఓటిటి సంస్థ డిస్నీ+ హాట్ స్టార్ వారు కొనుగోలు చేయగా ఇందులో ఈ చిత్రం ఈ ఫిబ్రవరి 17 నుంచి అయితే అందుబాటులో ఉండనున్నట్టుగా ఇప్పుడు కన్ఫర్మ్ అయ్యింది. దీనితో ఈ చిత్రాన్ని చూడాలి అనుకునేవారు అప్పుడు వరకు ఆగాల్సిందే అని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి ఆస్కార్ విన్నర్ ఎం ఎం కీరవాణి సంగీతం అందించగా శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ వారు నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు