బ్లాక్ బస్టర్ సాంగ్ రీమిక్స్‌తో వస్తున్న రాజాసాబ్.. ముగ్గురు గుమ్మలతో ప్రభాస్ ‘నాచే నాచే’..!

బ్లాక్ బస్టర్ సాంగ్ రీమిక్స్‌తో వస్తున్న రాజాసాబ్.. ముగ్గురు గుమ్మలతో ప్రభాస్ ‘నాచే నాచే’..!

Published on Jan 3, 2026 10:39 PM IST

The Raja Saab

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘ది రాజా సాబ్’(The Raja Saab) జనవరి 9న వరల్డ్‌వైడ్‌గా రిలీజ్‌కు రెడీ అయింది. దర్శకుడు మారుతి డైరెక్ట్ చేస్తున్న ఈ హారర్ డ్రామా మూవీలో ప్రభాస్‌ను ఫ్యాన్స్ ఎలా అయితే చూడాలని అనుకున్నారో, అలా చూపించబోతున్నారు. ఇక ప్రభాస్ నుంచి ఎంతోకాలంగా మిస్ అవుతున్న అంశాలు అన్నీ ఈ సినిమాలో మనకు కనిపిస్తాయి.

ఈ సినిమాలో ప్రభాస్ నుంచి సాలిడ్ డ్యాన్స్ మూమెంట్స్ చూడబోతున్నాం. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ‘రెబల్ సాబ్’ ‘సహానా సహానా’ సాంగ్స్‌కు మంచి రెస్పాన్స్ దక్కింది. ఇక ఇప్పుడు ఈ సినిమా నుంచి ది మోస్ట్ అవైటెడ్ ‘నాచే నాచే’ సాంగ్‌ను రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయింది. బాలీవుడ్‌లో బ్లాక్‌బస్టర్ చిత్రంగా నిలిచిన ‘డిస్కో డ్యాన్సర్’ మూవీలోని ‘నాచే నాచే’ సాంగ్‌ను రీమిక్స్ చేస్తూ, థమన్ ఇచ్చిన క్యాచీ ట్యూన్స్‌కు ప్రభాస్ అదిరిపోయే స్టెప్పులు వేయబోతున్నాడు. ఈ సాంగ్ ప్రోమోను తాజాగా రిలీజ్ చేశారు.

పూర్తి కలర్‌ఫుల్ సాంగ్‌గా రాబోతున్న ఈ పాటలో ప్రభాస్ ముగ్గురు హీరోయిన్లతో చిందులు వేయనున్నాడు. మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ గ్లామర్ ఫీస్ట్ ఇవ్వడంతో పాటు ప్రభాస్‌తో స్టన్నింగ్ స్టెప్స్ వేయించబోతున్నారు. ఈ ప్రోమో ఆసక్తికరంగా ఉండటంతో ఈ సాంగ్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టి.జి.విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ ప్రొడ్యూస్ చేస్తున్నారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

తాజా వార్తలు