నాగ్ ఫ్యాన్స్ ని నిరాశ పరిచాడుగా…!

Published on Aug 31, 2019 3:00 am IST

నిన్న నాగార్జున పుట్టిన రోజు వేడుకలను ఆయన అభిమానులు ఘనంగా జరిపారు. కింగ్ నాగార్జున నిన్న తన 60వ ఏట అడిగిడటం జరిగింది. ఈ స్పెషల్ పుట్టిన రోజును జరుపుకోవడానికి నాగ్ ఫ్యామిలీ మొత్తం ఇటలీ వెళ్లారు. అక్కడ తన కుటుంబ సభ్యులతో ఈ వేడుకను జరుపుకోవడం జరిగింది. ఐతే ఒక విషయంలో మాత్రం నాగార్జున అభిమానులను నిరుత్సహపరిచారు.

పుట్టిన రోజు కానుకగా నాగ్ తన కొత్త చిత్రానికి సంబందించిన ప్రకటన చేస్తారని అందరూ భావించారు. కానీ ఆశ్చర్యకరంగా నాగ్ అలాంటి ప్రకటన ఏమి లేకుండానే విదేశాలకు వెళ్లిపోయారు. బంగార్రాజు చిత్రానికి సంబంధించి ఏదైనా ప్రకటన రావచ్చు అని అభిమానులు ఆశించారు. ఎందుకంటే అసలు సోగ్గాడే చిన్న నాయనా చిత్ర సీక్వెల్ అయిన ఈ చిత్ర చిత్రీకరణ ఎప్పుడో మొదలుకావాల్సి వుంది. 2020 సంక్రాంతి కానుకగా బంగార్రాజు మూవీని విడుదల చేయాలని కూడా భావించారు. ఏమైందో ఏమో కానీ ఆ మూవీ సెట్స్ పైకెళ్ళడం లేదు. దీనితో పుట్టిన రోజు కానుకగా నైనా కొత్త మూవీ ప్రకటన రావొచ్చని ఆశించిన అభిమానులకు నిరాశే మిగిలింది.

సంబంధిత సమాచారం :