“శ్రీదేవి సోడా సెంటర్” నుండి నాలో ఇన్నాళ్ళు గా లిరికల్ సాంగ్ విడుదల

Published on Aug 11, 2021 12:00 pm IST


సుదీర్‌బాబు శ్రీదేవి సోడా సెంట‌ర్ అనే స‌రికొత్త కాన్సెప్ట్ చిత్రం తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్నారు. ఈ చిత్రం లో శ్రీదేవి గా ఆనంది ప్రధాన పాత్రల్లో న‌టిస్తుంది. ఈ సినిమాని పలాస 1978 ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వంలో 70mm ఎంటర్టైన్మెంట్ పతాకంపై విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం నుండి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, సూరిబాబు, శ్రీదేవి గ్లింప్స్ లు సూప‌ర్ రెస్పాన్స్ అందుకున్నాయి. అలాగే మణిశర్మ అందించిన మందులోడా ఓరి మాయ‌లోడా అనే సాంగ్ నెటిజ‌న్స్ ని వూపేస్తుంది. దీని మీద రీల్స్‌, క‌వ‌ర్ సాంగ్స్ ని యూత్ సోష‌ల్ మీడియాలో చేస్తున్నారు.

ఈ చిత్రం లో సూరిబాబు, శ్రీదేవి ల మ‌ద్య ల‌వ్ అండ్ రొమాంటిక్ మూమోట్స్ కూడా అదే రేంజ్ లో ఉన్నాయి అని తెలుస్తోంది. నాలో ఇన్నాళ్ళ గా అనే పాటను చిత్ర యూనిట్ తాజాగా విడుదల చేయడం జరిగింది. మ‌ణిశ‌ర్మ గారికి తొడుగా ప్ర‌ముఖ గేయ ర‌చ‌యిత శ్రీ సిరివెన్నెల సీతారామ శాస్ట్రి గారు త‌మ క‌లాన్ని క‌లిపారు. ఈ పాట‌ని ప్ర‌ముఖ సింగ‌ర్స్ దిన‌క‌ర్‌, ర‌మ్య బెహ్ర లు ఆల‌పించడం జరిగింది. లిరికల్ సాంగ్ విడుదల అవ్వడం గో ప్రేక్షకుల నుండి మంచి స్పందన వస్తోంది. సిరివెన్నెల సీతారామశాస్త్రి అద్భుతమైన సాహిత్యం ఈ పాటను మరో స్థాయికి చేర‌డ‌మేకాకుండా శ్యామ్ దత్ సైనుద్దీన్ సినిమాటోగ్రఫీ విజువ‌ల్స్ ప్రేక్ష‌కుల్ని విప‌రీతంగా ఆక‌ట్టుకుంటున్నాయి. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు చిత్ర యూనిట్. ఈ చిత్రాన్ని వీలైన త్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :