కమర్షియల్ దర్శకుల చూపు నభా వైపు

Published on Jul 20, 2019 3:00 am IST

‘ఇస్మార్ట్ శంకర్’ సినిమా చూసిన ప్రేక్షకులు బాగా తలచుకుంటున్న పేరు నభా నటేష్. సినిమాలో ఆమె పాత్రకు, ఒలకబోసిన అందాలకు ఫిదా అయ్యారు కుర్రకారు. పూరి సినిమాటిక్ ట్రీట్ కోసం సినిమాకు వెళితే నభా గ్లామర్ ట్రీట్ బోనస్‌గా దొరికిందని అంటున్నారు. సినిమాలోని హైలెట్ అంశాల్లో రామ్, నభాల లవ్ ట్రాక్, రొమాన్స్, కెమిస్ట్రీ కూడా ప్రధానంగా ఉన్నాయి.

ఒక కమర్షియల్ సినిమాకు ఎంతలా ఉపయోగపడాలో అంతగా ఉపయోగపడింది నభా. సినిమా చూసిన ప్రేక్షకులు, విమర్శకుల ఆమె గురించి ప్రస్తావించకుండా ఉండలేకపోతున్నారు. ఈ దెబ్బతో తెలుగు సినిమాకు మరొక కమర్షియల్ హీరోయిన్ దొరికిందని కితాబిస్తున్నారు. ఈ ఫీడ్ బ్యాక్ కారణంగా ఇకపై కమర్షియల్ సినిమాలు చేయాలనుకునే దర్సకులకి నభా కూడా ఒక మంచి ఛాయిస్ అవుతుందనడంలో అనుమానం లేదు.

సంబంధిత సమాచారం :

X
More