ఆ హీరోయిన్ వేసిన ప్లాన్ ఫలిస్తుందా ?

Published on Jun 10, 2019 8:57 pm IST

దక్షిణాదిన ఏ పరిశ్రమలోని హీరోయిన్ అయినా సరే తెలుగు ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలనే అనుకుంటుంది. కారణం టాలీవుడ్లో క్లిక్ అయితే కెరీర్ గ్రాఫ్ వేరే స్థాయిలో ఉంటుంది. స్టార్ హీరోయిన్ అనే స్టేటస్, వరుస ఆఫర్లతో పటు రెమ్యునరేష్ కూడా భారీగానే ఉంటుంది. అందుకే పర భాషా హీరోయిన్లు తరచూ తెలుగులో అదృష్టాన్ని పరీక్షించుకుంటూ ఉంటారు. అలా వచ్చిన నటీమణే నాభ నటేష్.

2018లో ‘నన్ను దోచుకుందువటే’ చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన ఈ కన్నడ భామ కమర్షియల్స్ సినిమాల మీద దృష్టి పెట్టింది. మొదటి సినిమా విజయం సాధించి వరుస ఆఫర్లు వచ్చినా కాదని కొంచెం గ్యాప్ తీసుకుని మరీ పూరి జగన్నాథ్ డైరెక్షన్లో రూపొందుతున్న ‘ఇస్మార్ట్ శంకర్’కు సైన్ చేసింది. పూరి అంటేనే కమర్షియల్ సినిమాకి పర్యాయపదం లాంటి వారు. ఆయన సినిమా హిట్టయితే అందులోని హీరోయిన్ల కెరీర్ దాదాపు సెట్ అయిపోయినట్టే. అందుఎక్ నాభ నటేష్ ‘ఇస్మార్ట్ శంకర్’ విజయంపై అస్లు పెట్టుకుని ఫ్యూచర్ గ్రాఫ్ గీసేసుకుంది. మరి ఆమె ప్లాన్ ఫలిస్తుందో లేదో జూలై 12న చూడాలి.

సంబంధిత సమాచారం :

More