పవన్ అత్త వరుణ్ తేజ్ అమ్మగానా..!

Published on Feb 27, 2020 10:55 pm IST

గత ఏడాది గద్దలకొండ గణేష్ చిత్రంలో ఊరమాస్ విలన్ గా కొత్త అవతారంలో వరుణ్ ఇరగదీశాడు. కెరీర్ ప్రారంభం నుండి ప్రయోగాల హీరోగా పేరున్న వరుణ్ చేస్తున్న తాజా చిత్రం షూటింగ్ జరుపుకుంటుంది. ఇటీవలే ఈ చిత్ర ఫస్ట్ షెడ్యూల్ షూట్ కొరకు చిత్ర యూనిట్ వైజాగ్ వెళ్లడం జరిగింది. ఈ చిత్రంలో వరుణ్ ప్రొఫెషనల్ బాక్సర్ రోల్ చేస్తుండగా పాత్ర కోసం చాలా కష్టపడ్డాడు. పాత్రకు తగ్గట్టుగా మజిల్ బాడీ సిద్ధం చేసిన వరుణ్ ప్రొఫెషనల్ బాక్సర్స్ దగ్గర శిక్షణ తీసుకున్నారు.

కాగా ఈ చిత్రంలో వరుణ్ అమ్మగా సీనియర్ హీరోయిన్ నదియాను తీసుకున్నారట. మొదట్లో ఈ పాత్ర కొరకు రమ్య కృష్ణ ను తీసుకున్న చిత్ర బృందం ఆమెకు బదులు నదియాను తీసుకున్నారని తెలుస్తుంది. ఈ మధ్య అనేక చిత్రాలలో నదియా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తున్నారు. త్రివిక్రమ్-పవన్ ల బ్లాక్ బస్టర్ మూవీ అత్తారింటికి దారేది చిత్రంలో నదియా పవన్ కళ్యాణ్ అత్తగా కీలక రోల్ చేశారు. ఇక వరుణ్ 10వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ మూవీకి కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహిస్తున్నారు. సిద్దు ముద్ద, అల్లు వెంకట్ నిర్మాతలుగా నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

X
More