ప్రభాస్ ఫ్యాన్స్ కు సూపర్ కిక్కిచ్చిన నాగ్ అశ్విన్.!

Published on Jan 23, 2021 11:00 am IST

ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా చేస్తున్న పలు బిగ్గెస్ట్ పాన్ ఇండియన్ ప్రాజెక్టులలో ప్రభాస్ ఫ్యాన్స్ కు ఎంతో దగ్గరగా ఫీలయ్యే మోస్ట్ అవైటెడ్ సినిమా మాత్రం నాగ్ అశ్విన్ తో ప్లాన్ చేసిన సాలిడ్ ప్రాజెక్ట్ అనే చెప్పాలి. దీనిని పాన్ ఇండియన్ లెవెల్లో కాకుండా పాన్ వరల్డ్ స్థాయిలో ప్లాన్ చేస్తున్నారు. మరి మంచి స్కై ఫై థ్రిల్లర్ సబ్జెక్టు తో సిద్ధం చేస్తున్న ఈ సినిమా నుంచి అప్డేట్స్ పరంగా అయితే నాగ్ అశ్విన్ ఎప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్ ను నిరాశ పరిచింది లేదు.

లీడ్ క్యాస్ట్ నుంచి సోషల్ మెడలో ప్రభాస్ ఫ్యాన్స్ తో టచ్ లో ఉంటూ ఎప్పటికప్పుడు అప్డేట్స్ విషయంలో క్లారిటీ ఇస్తూనే ఉంటాడు ఈ టాలెంటెడ్ దర్శకుడు. ఇక ఇదిలా ఉండగా ఇప్పుడు మళ్ళీ ప్రభాస్ ఫ్యాన్స్ కు సూపర్ కిక్ ఇచ్చాడు. సోషల్ మీడియాలో వీరి కాంబో కు సంబంధించి అభిమానుల మధ్య టాపిక్ రాగా ఏకంగా రెండు అప్డేట్స్ ను ఇస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేసేసాడు.

మొదటి అప్డేట్ ఈ జనవరి 29న వదలనుండగా రెండో అప్డేట్ ను వచ్చే ఫిబ్రవరి 26 న ఇస్తున్నట్టుగా ప్రభాస్ ఫ్యాన్స్ కు ట్విట్టర్ లో చల్లటి కబురును అందజేశాడు. దీనితో ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయ్యిపోయారు. ఇక ఈ భారీ చిత్రంలో బాలీవుడ్ స్టార్ దీపికా పదుకొనె హీరోయిన్ గా నటిస్తుండగా అమితాబ్ ఫుల్ లెంగ్త్ ఓ కీలక రోల్ ను చెయ్యనున్నారు. అలాగే ఈ చిత్రాన్ని అశ్వని దత్ 500 కోట్లకు పైగా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More