చైతూ, సమంత పెళ్ళికి ముందే ఆ సినిమా స్టార్ట్ అవుతుంది!


ప్రస్తుతం ఇండస్ట్రీ లో అందరు నాగచైతన్య, సమంత పెళ్లి గురించే మాట్లాడుకుంటున్నారు. ఈ పెళ్లి అయ్యేంత వరకు నాగచైతన్య మరో సినిమా జోలికి వెళ్ళాడని కూడా వార్త హడావిడి చేస్తుంది. అయితే ఇందులో నిజం లేదని తేలిపోయింది. గతంలో ప్రేమమ్ సినిమాతో నాగచైతన్యకి హిట్ ఇచ్చిన చందూ మొండేటి దర్శకత్వంలో చైతు ఒక సినిమా కమిట్ అయ్యాడు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో రానున్న ఈ సినిమా ఎప్పుడు పట్టాలు ఎక్కుతుంది అనే విషయం ఇన్ని రోజులు క్లేరిటి లేదు. అయితే దానిపై ఇప్పుడు చందూ మొండేటి ఓ ఇంటర్వ్యూ లో క్లేరిటి ఇచ్చాడు. చైతన్యతో తాను చేయబోయే సినిమా అతని పెళ్ళికి ముందే ఉంటుందని చెప్పాడు. దీంతో త్వరలో చందూ, చైతు కాంబినేషన్ లో మూవీని ఆశించొచ్చు అని అందరు అనుకుంటున్నారు.