‘దేవదాస్’గా రానున్న నాగ్ , నాని !

‘దేవదాస్’గా రానున్న నాగ్ , నాని !

Published on Jul 5, 2018 7:18 PM IST

deva5

శ్రీ రామ్ ఆదిత్య దర్శకత్వంలో కింగ్ నాగార్జున మరియు సహజ నటుడు నాని నటిస్తున్న మల్టీ స్టాటర్ చిత్ర టైటిల్ పోస్టర్ కొద్దిసేపటి క్రితం విడుదలైయింది. దేవదాస్ అనే టైటిల్ తో ఉన్న ఈ చిత్ర పోస్టర్ ఆసక్తిని క్రియేట్ చేస్తుంది. ఈ చిత్రంలో దేవ్ పాత్రలో నాగ్ నటిస్తుండగా దాస్ పాత్రలో నాని కనిపించనున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని వైజయంతి మూవీస్ పతాకం ఫై అశ్వినీదత్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా చిత్రకరణ జరుపుకుంటున్న ఈ చిత్రం సెప్టెంబర్ లో విడుదలకానుంది.

ఇక ఈచిత్రంలో నాగ్ సరసన ఆకాంక్ష సింగ్ నటిస్తుండగా , నాని సరసన రష్మిక మండన్న నటిస్తున్నారు. ఇక మొదటిసారి నాగ్ , నాని కలయికలో రానున్న ఈ మల్టీ స్టారర్ చిత్రం ఫై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి .

తాజా వార్తలు