చిరు జనసేనలో చేరరు…కారణం చెప్పిన నాగబాబు..!

చిరు జనసేనలో చేరరు…కారణం చెప్పిన నాగబాబు..!

Published on May 1, 2020 8:09 AM IST

Chiru Pawan

మెగా బ్రదర్ నాగబాబు తనకు గల నా ఇష్టం అనే యూట్యూబ్ ఛానెల్ ద్వారా తన భావాలు అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. ఈ మధ్య ఆయన ఫ్యాన్స్ తో ప్రశ్నోత్తరాల కార్యక్రమం కూడా మొదలుపెట్టారు. దీనిలో భాగంగా ఓ అభిమాని చిరంజీవి జనసేనలో చేరే అవకాశం ఉందా అని ఓ ప్రశ్న అడుగగా, ఆయన ఆసక్తికరంగా స్పందించారు. చిరంజీవి జనసేనలో చేరే అవకాశం ఏమాత్రం లేదని నాగబాబు క్లారిటీ ఇచ్చారు.

దానికి కారణం చిరు సినిమాలలోకి రీ ఎంట్రీ ఇచ్చే ముందే తాను ఇక రాజకీయాలలో అడుగుపెట్టను అని చెప్పారు. కాబట్టి జనసేనలో చేరితే మళ్ళీ ఆయన రాజకీయాలలోకి వచ్చినట్లే అవుతుంది. కాబట్టి ఆయన రాజకీయాలలోకి రాకుండా తన అనుభవాన్ని చిత్ర పరిశ్రమ అభివృద్ధి కోసం, దానిపై ఆధారపడిన వారి సేవ కోసం ఉపయోగిస్తారు అని నాగబాబు చెప్పడం జరిగింది. ఐతే భవిష్యత్తు మనం చెప్పలేం కాబట్టి ఒక వేళ ఆయన మనసు మారితే చెప్పలేము అని ఆ అభిమాని సందేహం తీర్చారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు